బ్రేక్ ముగిసింది. నా నవ్వుకి కారణం...

Friday, September 4, 2009


రామాయణంలో లక్ష్మణుడి నవ్వు గురించి ఒక కథ చెప్తారు. కథందరికీ తెలుసనుకుంటున్నాను. తెలియకపోయినా తెలిసినట్లే. సీరియస్. అదొకసారి గుర్తుకు తెచ్చుకోండి.

మీడియా. అబ్బోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ!!! సూపరు కామెడీ. అసలు మన బ్లాగుల్లో మీడియా మీద బోల్డన్ని జోకులు. కొంచం నా మాటలు అర్థం కావటంలేదా?

అయితే కాస్త పూర్వరంగం తెలియాల్సిందే! చదవండి.

September 2, 2009,
Time: 3:45 pm,
Tenali.

"వయ్యస్సార్ మాయమయ్యాట్టరా అబ్బాయ్!" అక్కయ్య చెప్పింది. మావాడు నవ్వి జోకులొద్దు అన్నాడు. కాసేపటికి మాకు అర్థం అయింది... ముఖ్య మంత్రి వయ్యస్సార్ పొద్దున నుంచీ ఆచూకీ లకుండా ఉన్నారనీ, అడవుల్లో చిక్కుకున్నారనీ...!

September 2, 2009,
Time: 11:24,
Guntur.

ఇంటికి నేను రాగానే నాన్ననీ, అన్నయ్యనీ అడిగింది, "నాన్నా వైఎస్ గురించి ఏమన్నా సమాచారం అందిందా," అనే! ఆతుర్దా. ఎందుకో నాకొక్కడికే తెలుసు. ఒక మంచి మనిషి. గొప్ప మనిషి. మనీషి కాబోతున్న మనిషి. "వై" అనకుండా "ఎస్" అంటూ "రాష్ట్ర ప్రజలకి" అన్నీ ఇవ్వాలని తపించే వ్యక్తి. కనీసం ఇవ్వాలని చెప్పే మనిషి. అలాంటి వ్యక్తికేమన్నా జరిగితే తట్టుకోగలగటం కష్టమే.

The Omen

September 3, 2009,
Time: 6:50.
సాక్షి పేపర్ తీసి న్యూస్ కోసం చూస్తూ యథాలాపంగా కార్టూను కోసం చూశాను. అది ఇలా ఉంది. చూడండి...

ఏంట్రా నాయనా పొద్దున్నే ఇది. మనిషుండగానే దండేసి దణ్ణం పెడుతున్నారు!!! అనుకున్నాను. ఇందులో దండ లేదనుకోండి.

కాలేజ్ కని బయలుదేరి్తే కాలేజ్ లేదని డ్రైవర్ చెప్పి వెళ్లిపోయాడు. మళ్ళా ఇంటికొచ్చి టీవీ పెట్టాను. ఎన్నాళ్ళైందో. ఐపీయల్ తరువాత టీవీ మొహం చూసి. పెట్టటం పెట్టటమే న్యూస్ ఛానల్ పెట్టను. ముఖ్య మంత్రి ప్రయణించిన హెలికాప్టర్ ఆచూకీ కనుగొన్నారన్న వార్త విని కాస్త రిలీఫ్. (ఏడ్చిన వాళ్ళనీ చూశాను. హ్మ్).

వేసిందే వేసీ, చెప్పిందే (ప్పించిందే) చెప్తుండటంతో, టీవీ కట్టేస నా పనిలో పడ్డాన. ఒఖరగంఠ (No typo) తరువాత మళ్ళా న్యూస్ వినాలని టీవీ పెట్టాను. విషయమేమీ మారలేదు. ఇంకా చేరుకునే ప్రయత్నంలనే ఉన్నారు(ట!).

రాజూ వెడలే రవితేజములలరగ...

September 3, 2009
Time: 11:30,
Guntur.

టీవీలో పేదల మనషి ఇక లేరు అనే వార్త. ఇల్లంతా పాకింది. వార్త పాకేటప్పుడూ, పాకిన తరవాతా. ఒకరకమైన మౌనం రాజ్యమలింది. వయ్యస్సార్ ఇక లేరు. చేదు నిజం. ఎంతటి నిజమంటే... ఆయన తనని నమ్మకున్న వారినెప్పుడూ మోసం చేయరన్నంత నిజం! 
***   ***   ***

మీడియా పై నిప్పులు 

ఇక మరో సంగతి! ఈ సందర్భంలో మీడియా తీరు గురించీ, మంత్రుల తీర్మానం గురించీ, ఎక్కడ చూసినా చర్చలే. ఊహగానాలు. ఊహల పల్లకీలు. ఎవరు ముఖ్య మంత్రి అవుతారనీ! ఇంతలో చాలా మంది మంత్రులు, ఇంకా చాలా మంది ఎమ్మెల్ల్యేలూ, మరింత మంది ఎమ్పీలూ వైఎస్ జగన్ ని ముఖ్య మంత్రిని చేయాలనీ, తీర్మానించినట్లు విన్నాను. 

మీడియా తీరు గురించి ఒక బ్లాగులో (మీడియా గురించి విమర్శలు చేస్తూనే, మన బ్లాగర్లు అవకాశం దొరగ్గానే పండగ చేసుకున్నారు. వ్రాసిన అందరిలోనూ సిన్సియారిటీ ఉండొచ్చు. నేనొప్పుకుంటాను. కొత్త విషయం దొరకగానే దాన్ని నలుగురితో పంచుకోవాలనీ, అందరిలోనూ తామ గొంతు వినపించాలని అందరికీ ఉంటుంది. ఇదే విస్తృత స్థాయిలో చూస్తే మీడియా కూడా అంతే కదా!. మీడియా అయినా అలాగే కదా. ఏ ఛానల్ అయినా అందరికన్నా ముందే న్యూసునందించి వీక్షకుల్ని తమ ఛానల్ ముందే కట్టిపడేయాలనే ఆలోచన. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఛానల్ కూడా మడిగట్టుకుని కూచునేలా లేదు. బ్రహ్మానందంచేత జంధ్యాల పలికించిన తీరులో "శవం మీద మరమరాలు..." తయారయ్యాయి ఛానళ్ళు.

ఒక బ్లాగులో నా వ్యాఖ్యకి ప్రతి వ్యాఖ్యగా... 
"గీతాచార్య,
మీరు మీడియాను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు.మీరనుకుంటున్నంత అల్లాటప్పాగా లేదు మీడియా! ఆక్టోపస్ లాగా అది ప్రజాభిప్రాయన్ని ఎలా కబళిస్తోందో తెలియాలంటే మీరు కొద్ది రోజులు సెలవు పెట్టి మరీ మీడియా ఛానెళ్ళను పరిశీలించాలి."
ఇలా ఉంది. (నా బ్లాగుల్లో ఎంతో అవసరం అయితే తప్ప వ్యక్తుల, ఇతర బ్లాగర్ల పేర్లని చెప్పను. అది వారికిబ్బంది కలిగింవచ్చు. ఇక్కడ విషయం ముఖ్యం. కొనసాగుదాము).


అసలు నేను పెట్టిన వ్యాఖ్య...


"No comment on media. It never deserves such attention. మీరు మీడియా గురించి చెప్పగానే నవ్వలేక చచ్చాను. అసలొకటి ఉందంటూ పట్టించుకోవటం అవసరమా? వాళ్ళ గురించి ఆలోచించటం అవసరమా?... బ్రే......క్ తరువాత." 

వైఎస్ జగన్ని ప్రొజెక్ట్ చేయటంలో, ప్రజల నెత్తి మీద ఇలా తమ తమ అభిప్రాయాలని రుద్దటంలో మీడియా చాతుర్యాన్ని గురించి ఇలా కూడా వ్రాయబడినది...

Media and it's prowess


ఈ రోజు జగన్ పేరుని ప్రముఖంగా పైకి తీసుకొచ్చింది ఒక రకంగా మీడియానే! కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఏమిటో తెలీయకుండానే (ఫైనల్ గా జగన్ పేరే వస్తుందనూకోండి) భావోద్వేగాలతో కొట్టు మిట్టాడుతున్న జనాన్ని" జగన్ నాయకుడు గా వస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు కదూ"అని,ఇంకా అంత్యక్రియలు కూడా జరగకముందే ఒపీనియన్ పోల్స్ నిర్వహించి జనాన్ని రెచ్చగొట్టి జనం చేత నినాదాలు చేయించిన మీడియా సిగ్గులేని తనాన్ని ఇవాళ జనం చూశారు. మీడియాను పట్టించుకోకుండా వదిలేయాలనడం "ఈజీ గోయింగ్" ఆలోచనతో పరిస్థితిని తేలిగ్గా తీసుకుని మాట్లాడటమే అవుతుంది. ఇది సీరియస్ గా ఉండాల్సిన తరుణం! 

But my comments are more than serious. I'm in no way easy going. I'm damn serious regarding every thing that comes my way. The only thing misunderstood is the air of my presentation. విషయాల్ని matter of fact గా తీసుకుని, దేనికీ బాధపడని తత్వమే!


అసలు మీడియాకి విలువెందుకివ్వాలి? మనం విలువివ్వబట్టే కదా సమస్య. మనం పట్టించుకోవటం మానేస్తే...! అసలు మనకంటూ ఒక స్వంత గొంతుక లేకపోబట్టే కదా ఇతరుల గొంతే మన గొంతుగా చెలామణీ అవుతున్నది. మనం మీడియా తీరుని ఖండిస్తున్నాము అంటే మనం దాని ద్వారా ఎంతో కొంత  ప్రభావితమయ్యామనే కదా అర్థం. ఒకళ్ళు కాకపోతే మరొకళ్ళయినా ఆ ప్రభావంలో పడటమే వాళ్లకా అవకాశాన్నందిస్తున్నది. Leave the media aside. Stand for your OWN & INNER VOICE. అది సామాన్య జనానికర్థం కావటంలేదు. ఇక ముందు కూడా కాబోదేమో!


మనకెంత సేపూ, ఎవరో రావాలి, ఏదో చేయాలి తప్ప మనం చేయలేము. వంశాలు తొడగొట్టటాలు చూసి ఆనందించటమే కానీ మనమా స్థాయినందుకోవాలనే స్పృహే లేని జనాన్ని మీడియా ఎందుకు ప్రభావితం చేయదు. డబ్బుకోసం వార్తలు కానీ, జనాన్ని ఎడ్యుకేట్ చేయటం కోసం వార్తలని చెప్పిన వాళ్ళు ఎందరు? ఒకప్పటి విలువలు ఈనాడు లేవు. We must accept the fact, and act accordingly. Just start ignoring that GOD-DAMN media. ఒకళ్ళొకళ్ళుగా ఆ పని మొదలెడితే, తన అల్లరిని పట్టించుకోనప్పుడు పిల్లలు గొడవాపేసినట్టు ఎంత పెద్ద మీడియా అయినా క్రమంగా తన పంథా మార్చుకుని అవసరమయిన విషయాలకే ప్రాధాన్యం ఇవ్వటం మొదలెడుతుంది. 


వాళ్ళడగగానే ఎసెమ్మెసులు చేయటం, ఫోనుల్లో మాట్లాడాలని తన్నుకోటం, ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాయటం! అసలు ఆ విషయాల్నే పట్టించుకోందే!... వాళ్ళాపేయరా?  పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. If you start ignoring something, it will cease to exist. పాములు కాళ్ళని వాడటం మానగానే కాళ్ళు లేకుండా పోలా? Evolution theory. ఇదీ అంతే. మీడియా చేష్టలకి అఫెన్స్ అవుతున్నారు కాబట్టే వాళ్ళ ఆగడాలు సాగుతున్నాయి.
***   ***   ***


ఇంకా వ్రాయాలి. కానీ ఇది చాలనుకుంటున్నాను. వయ్యస్సార్ గురించైతే చాలా చెప్పాలి. అది రేపు.

Note: ఎక్కడైనా అసంపూర్తిగా అనిపిస్తే అది కేవలం time constraint వల్లే. చెప్పాల్సింది చాలా ఉంది. దాని మీద నాకు క్లారిటీ కూడా ఉంది. చూద్దాం! ఏం జరుగుతుందో... 

4 comments:

KRK said...

Brilliant! That's all. Very good style. chaalaa baaggaa present cheshaaru. stylish ga. kakapothe samagrata kavali. meere annaru kadaa imka raayaalani. raayamdi.

Sujata said...

haa haa haa. Its pure business. We want infotainment and they are selling it to us. If only we want information, it would have been very different today. We get entertained hugely by these news channels. No one seems to like the idea of missing the news.

sunita said...

బాబూ, (నీ అసలు పేరు, బ్లాగు పేరు ఒకటేనా?) మొదట నా బ్లాగులో కామెంటు రాసినందుకు థాంక్స్. వరూధినిగారూ, సుజాతగారూ వాళ్ళతో పాటు (బ్లాగుల్లోనే సుమా) వాళ్ళింట్లో నీ ఫోటో కూడా చూసాను, ఎవరో చిన్న కుర్రాడు అనుకున్నాను. నే పేరు చూసి ఎంత గంభీరం గా రాస్తావో ఎవడు చదువుతాడులే అనుకున్నాను.మొన్నటికి మొన్న స్రుజన గారు కూదా అయాన్ రాండ్ ఫాను అని తెలిసి బోలెడు సంతోషించాను. ఇంకా తనకో మాట చెప్పి "ఫవుంటను హెడ్" గురించి రాద్దామనుకుంటున్నాను, ఈరకంగా మీరందరూ, "అట్లస్ ష్రుగ్గెడ్" దగ్గర్నుంచి," వి ద లివింగ్" వరకూ రాసేసారని నాకు తెలియదు నేను రాండ్ను చదివిన కాలంలో టీవీయే నలుపూ తెలుపూ ఇంకా యూటూబు కు అవకాశమే లేదు. ఇవ్వాళ మీ కామెంటు పట్టుకుని మీ బ్లాగులు చదివాను. చాలా సంతోషమనిపించింది. Good work!Keep going!!

About This Blog

Lorem Ipsum

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP